in

king Nagarjuna To Play villain In Rajinikanth’s Coolie?

మధ్య సినిమాలు తగ్గించిన టాలీవుడ్ మన్మధుడు నాగార్జున మళ్ళి బిజీ కాబోతున్నారు..ఎప్పుడు చేయని రోల్, అది కూడా ఒక సూపర్ స్టార్ కు విలన్ గ చేయనున్నాడు…నాగ్ మరొక క్రేజీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్  కాంబోలో వస్తున్న’కూలీ’ లో నాగ్ నటిస్తున్నట్లు తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ విలన్ గా కనిపించనున్నటు సమాచారం.

ఈ మధ్యనే ‘కూలి’ సెట్స్ మీదకు వెళ్ళింది. రజనీకి సమానంగా  ఉండే విలన్  క్యారక్టర్ కావడంతో నాగార్జున కూడా దీనికి ఓకే చెప్పారని, లోకేశ్ నాగ్ ని డిఫరెంట్ గా చూపించబోతున్నారని కోలీవుడ్  మీడియా టాక్. నాగార్జున సాహసం చేస్తున్నారనే చెప్పాలి. మన్మథుడిగా పేరు పొందిన నాగ్ విలన్ గా కనిపించటమంటే ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి..లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరో క్యారక్టర్ తో పాటు, విలన్ పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. విక్రమ్ సినిమాలో కమల్ తో  పాటు విజయ్ సేతు పతికి కూడా మంచి పేరు వచ్చింది..!!

samantha joins mirzapur fame ali fazal for a fantasy drama!

Raayan Telugu movie overall review