తమ ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేయడం వేరు. ఇప్పటికే వెంకటేశ్ తన అన్న కొడుకు రానాతో, మంచు మోహన్ బాబు తన కొడుకులతో సినిమాలు చేశారు. అంతే కాదండోయ్ నాగార్జున కూడా తన ఫ్యామిలీతో సినిమా చేశాడు. ఇవన్నీ తమ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ను తెలిపే విధంగా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఫ్యామిలీ హీరోతో కలిసి ఓ కమర్షియల్ సినిమా రాలేదు. ఈ దారిలో ఇప్పుడు మెగాస్టార్ పయనిస్తున్నాడు.
రామ్ చరణ్ తో కలిసి కొరటాల శివ డైరెక్షన్ లో కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇదే దారిలో పయనిస్తున్నాడు నాగార్జున తన కొడుకు అఖిల్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నానని ప్రెస్ మీట్ లో ప్రకటించాడు. మరి నాగచైతన్యతో ఎందుకు చేయట్లేదని అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో ఒకింత అసహనం కూడా చూపిస్తున్నారు. అయితే కథ డిమాండ్ మేరకు అఖిల్ తో చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు నాగార్జున.