in

Rakul Preet Singh to essay the role of a condom tester in her next?

తకొంతకాలంగా దక్షిణాది సినిమాలతో పోలిస్తే బాలీవుడ్‌కు అధిక ప్రాముఖ్యతనిస్తోంది పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్‌. హిందీచిత్రసీమలో స్థిరపడాలనే యోచనలో ఉన్న ఈ ముద్దుగుమ్మకు చక్కటి అవకాశాలు వరిస్తున్నాయి. తాజాగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఓ హిందీ సినిమాలో బోల్డ్‌ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. సామాజిక ఇతివృత్తంతో కామెడీ ఎంటర్‌టైనర్‌ సాగే ఈ సినిమాలో..

ఆమె కండోమ్‌ టెస్టర్‌ పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కార్పొరేట్‌ కంపెనీలో కండోమ్‌ టెస్టర్‌గా పనిచేసే ఓ యువతికి వృత్తినిర్వహణలో ఎదురయ్యే సమస్యల్ని వినోదాత్మక పంథాలో ఆవిష్కరిస్తూ ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింత్‌ పాత్ర బోల్డ్‌గా వినూత్న పంథాలో ఉంటుందని తెలిసింది. రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు..

Bandla ganesh to try his luck as a hero with tamil remake?

king Nagarjuna confirms multi-starrer with Akhil!