
పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు మంచు మనోజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానికి వచ్చిన కష్టంపై స్పందించి నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు. పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు తనకు ఎదురైన కష్టాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
సాయినాథ్ కల్యాణ్ అనే కుర్రాడు తను పవన్ కల్యాణ్ అభిమానినని.. జనసేన పార్టీ కోసం తిరిగానని చెప్పుకొచ్చాడు. తనకు పవన్ అంటే ప్రాణమని.. ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని రాసుకొచ్చాడు. ఇక ఇప్పుడు తన తండ్రికి సీరియస్‌గా ఉందని.. కానీ తన దగ్గర వైద్యం చేయించుకునేంత ఆర్థిక స్థోమత లేదని చెప్పాడు.
దీనిని సాయి ధరమ్ తేజ్, జేడీ లక్ష్మీనారాయణ, మంచు మనోజ్ లకు ట్యాగ్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన మనోజ్ నీ వివరాలు పంపు.. మా వాళ్లు నీ దగ్గరికి వచ్చి కలుస్తారు.. ధైర్యంగా ఉండు మీ నాన్నకు ఏం కాదంటూ ధైర్యం చెప్పాడు. దీంతో ఆయనపై ప్రసంసలు అందుకున్నాడు.