in

kerala beauty Samyuktha in for Bellamkonda’s Next!

టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో బిఎస్‌ఎస్‌12ను ఈ ఏడాది జులైలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వంలో మిస్టిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని మహేశ్‌ చందు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో భీమ్లానాయక్‌ ఫేం సంయుక్త ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది.

సంయుక్త పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె పాత్రకు సంబంధించిన స్టయిలిష్ ట్రెండీ లుక్‌ విడుదల చేశారు. సంయుక్త ఇందులో సవిూర పాత్రలో నటిస్తున్నట్టు పోస్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే టీం క్లారిటీ రానుంది. ఈ మూవీకి లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తున్నాడు..

Mathu Vadalara 2!

crazy update on Prabhas and Hanu Raghavapudi’s film!