in

Keerthy Suresh’s Next Film In Her Father’s Production!

న సినీ కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేసానని అంటుంది కీర్తి సురేష్. కాకపోతే తన తండ్రి ప్రొడక్షన్ లో రాబోతున్న ఈ సినిమా మాత్రం తనకు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుందని అంటుంది. కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ నిర్మిస్తున్న సినిమాకి వాషి అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాలో టోవినో థామస్ హీరోగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మలయాళంలో తెరకెక్కుతుంది. దీంతో తన ఏడేళ్ళ కల.. ఇప్పుడు నిజమవుతుందని..

ఈ సినిమా తనకు హార్ట్ టచింగ్ ఉంటుందని తన సోషల్ మీడియాలో అకౌంట్ లో తెలియజేసింది. ఒక కూతురిగా ఇంతకు మించిన అచీవ్ మెంట్ లభించదని ఎమోషనల్ అవుతుంది. ఇలాంటి పరిస్థితి అంత తేలికగా రాలేదని.. తన టాలెంట్ ని ప్రదర్శించడానికి తాను ఎంతో కష్టపడ్డానని అన్నారు. వాషి సినిమాతో తనకు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తూ.. బిజీగా ఉన్నారు

lavanya thripati finally does a liplock scene!

digital clash between samantha and kajal agarwal!