in

digital clash between samantha and kajal agarwal!

క్కినేని వారి కోడలు సమంత..మరియు కొత్త పెళ్లి కూతురు కాజల్ అగర్వాల్..ఈ ఇద్దరు స్టార్‌ హీరోయిన్ల మధ్య డిజిటల్‌ వార్‌ నెలకొంది. దీనికి కారణం వీరు తొలిసారిగా నటించిన వెబ్‌ సిరీస్‌లు ఒకేరోజు విడుదల అవ్వడమే..సమంత నటించిన వెబ్‌ సిరీస్‌ ది ఫ్యామిలీ మ్యాన్-2 ఫిబ్రవరి 12న ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో మనోజ్‌ బాజ్‌పేయి, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇక కాజల్‌ నటించిన  వెబ్‌ సిరీస్‌ ‘లైవ్‌ టెలికాస్ట్‌’ (ప్రత్యక్ష ప్రసారం) సైతం అదే రోజున డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ వీఐపీలో ప్రీమియర్‌ కానుంది.  వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన ఈ సిరీస్‌లో వైభవ్, ఆనంది కీలక పాత్రలు చేశారు. సస్పెన్స్, హారర్‌ థ్రిల్లర్‌గా ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. థ్రిల్లర్‌ జోనర్‌లో కాజల్‌ నటించడం ఇదే తొలిసారి. తమ ఫేవరెట్‌ హీరోయిన్లు ఒకేరోజు డిజిటల్‌ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వనుండటంతో సమంతా, కాజల్‌ ఫ్యాన్స్‌ మధ్య కూడా వార్‌ నడుస్తోంది

Keerthy Suresh’s Next Film In Her Father’s Production!

nani’s heroine sarcastic comments on bollywood star hero’s marriage!