in

Keerthy Suresh trashes wedding rumors!

హానటి సినిమాతోనే జీవితానికి సరిపోయేంత గౌరవాన్ని గుర్తింపును అందుకున్న బ్యూటీ కీర్తి సురేష్. మహానటి సావిత్రి బయోపిక్ చేయడానికి ఏ క్షణంలో ఒప్పుకుందో గాని ఆ తరువాత అమ్మడి జీవితమే మారిపోయింది. గ్లామర్ డోస్ పెద్దగా పెంచకపోయినా కూడా ఆఫర్స్ వరుస పెట్టి వస్తున్నాయి. ఇక ఆమె స్టార్ ఇమేజ్ పెరుగుతున్న కొద్దీ రూమర్స్ కూడా ఒక రేంజ్ లో వస్తున్నాయి. ముఖ్యంగా డేటింగ్, లవ్ ఎఫైర్ అంటూ కోలీవుడ్ లో రోజుకో రూమర్ వైరల్ అవుతోంది.

ఇదివరకే ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో పెళ్లి అని రూమర్స్ రాగా అలాంటిదేమి లేదని ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పేశారు. ఇక మొదటిసారి కీర్తి సురేష్ కూడా రెండు మాటలతో ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసింది. ‘పెళ్లికి ఇంకా టైమ్ ఉంది. ప్రస్తుతం నా ఫోకస్ అంతా కూడా వర్క్ పైనే ఉంది. జనాలకు, నా అభిమానులకు, ఫాలోవర్స్ కు చెప్పేది ఏమిటంటే.. జీవితంలో అలాంటి ముఖ్యమైన విషయం ఏదైనా వస్తే తప్పకుండా నేనే స్వయంగా చెబుతాను..అంటూ కీర్తి సురేష్ మ్యాటర్ క్లోజ్ చేసేసింది.

vakeel saab to turn as a lecturer for his next?

Nani’s ‘Shyam Singha Roy’ movie set damaged!