in

Keerthy Suresh to tie the knot with Antony Thattil

అతనితో పెళ్లికి సిద్ధమైన అయిన కీర్తి
పాన్ ఇండియా హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ప్రస్తుతం సెలబ్రిటీల పెళ్లి సందడి నడుస్తోంది. ఒకరి తరవాత ఒకరు పెళ్లి పీటలెక్కుతున్నారు. నాగ చైతన్య, శోభిత డిసెంబర్ 4 న వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఆదివారం కీరవాణి కొడుకు శ్రీ సింహ ప్రివెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఇప్పుడు కీర్తి సురేష్ పెళ్లి వార్త హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం తమిళం, తెలుగు , మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో బిజీగా ఉన్న కీర్తి ప్రేమించిన వాడితో పెళ్ళికి సిద్ధం అయింది.

బిజినెస్ మాన్ తో కీర్తి సురేశ్ పెళ్లి పీటలెక్కబోతోంది!
ఇన్నాళ్లు కీర్తి లవ్ స్టోరీ గూర్చి పుకార్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు సడెన్ గా పెళ్లి వార్త వినిపించటం తో ఆమె ఫాన్స్ షాక్ అవుతున్నారు. డిసెంబర్ 11న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతున్నట్లు సమాచారం. 12 న కేరళలోని కొచ్చిలో రిసెప్షన్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కీర్తికి కాబోయే భర్త పేరు ఆంటోనీ తట్టిల్. ఇతను దుబాయ్ లో పెద్ద బిజినెస్ మాగ్నిట్. కొన్నాళ్లుగా ఆంటోనీ, కీర్తి ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారని టాక్..!!

beauty Kavya Thapar Shocking Comments about Commitment!

nani to team up with Malayalam hitmaker vipin das!