in

Keerthy Suresh removed from Ajay Devgn’s upcoming film Maidaan!

అజయ్ దేవగణ్ లాంటి అగ్ర కథానాయకుడితో ‘బదాయి హో’ దర్శకుడు అమిత్ శర్మ రూపొందిస్తున్న సినిమా కావడంతో కీర్తికి ఇది బంపరాఫరే అనుకున్నారు. ఐతే సినిమా మొదలైనపుడు కీర్తిని కథానాయికగా ప్రకటించిన చిత్ర బృందం..కొన్నాళ్లకు ఆమె స్థానంలోకి ప్రియమణిని తీసుకొచ్చింది. అప్పట్లో ఈ సినిమా నుంచి తప్పుకున్న విషయం చెప్పిందే తప్ప కారణమేంటో వెల్లడించలేదు కీర్తి. చిత్ర బృందం కూడా దీని గురించి ఏమీ మాట్లాడలేదు. ఐతే ఏప్రిల్ 10న మైదాన్ విడుదల కానున్న నేపథ్యంలో మీడియాను కలిసిన దర్శకుడు అమిత్ శర్మ..

కీర్తిని తప్పించడం వెనుక అసలు కారణం చెప్పాడు..ఇందులో హీరో భార్య పాత్రకు తాను ఒక రూపాన్ని ఊహించుకున్నానని.. అప్పుడు కీర్తి సరిపోతుందని అనిపించిందని.. కానీ ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగిందని..ఈ లోపు కీర్తి బాగా బరువు తగ్గి లుక్ మార్చుకుందని..కొత్త లుక్‌ ఆ పాత్రకు సూటవ్వదని భావించి ఆమె స్థానంలోకి ప్రియమణిని తీసుకున్నట్లు వెల్లడించాడు. కీర్తి కెరీర్ ఆరంభంలో ఎంత బొద్దుగా ఉండేదో తెలిసిందే. కానీ తర్వాత ఉన్నట్లుండి బాాగా బరువు తగ్గి బక్కచిక్కిన లుక్‌లోకి మారింది..!!

Samantha fainted and suffered problems while shooting!

Janhvi Kapoor’s Special song In Allu Arjun’s Pushpa 2?