in

keerthy Suresh: I’m the most trolled south actress

ఈముద్దుగుమ్మ కెరీర్‌ ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని నటి కీర్తి సురేశ్‌ తెలిపారు. తాను నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పొందాయని.. దాంతో చాలామంది తనని విపరీతంగా విమర్శించారని ఆమె చెప్పారు. వారి మాటల వల్ల కొన్ని సందర్భాల్లో తాను ఎంతో బాధపడ్డానని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. అంతేకాకుండా తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి మాట్లాడుతూ తాను సింగిల్‌ కాదని బాంబు పేల్చారు. వర్క్‌ లైఫ్‌ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. మనసుకు నచ్చిన చిత్రాల్లో యాక్ట్‌ చేస్తున్నా..

కెరీర్‌ ఆరంభంలో నేను యాక్ట్‌ చేసిన చాలా చిత్రాలు ప్లాప్ అయ్యాయి. దాంతో నేను ఎన్నో ట్రోల్స్‌ ఎదుర్కొన్నా. నాకు తెలిసి ఎక్కువ ట్రోల్స్‌ ఎదుర్కొన్న దక్షిణాది నటిని నేనే. ’మహానటి’ తర్వాత నాపై ట్రోల్స్‌ తగ్గాయి. విమర్శలను నేనూ స్వాగతిస్తా. మంచి విమర్శల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటా. కానీ, కొంతమంది కావాలని నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తుంటారు. వాటిని పెద్దగా పట్టించుకోను. ఎక్కడా రియాక్ట్‌ కాను. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని భావిస్తున్నా అని కీర్తి తన మనసులోని మాటలని బైట పెట్టారు..!!

Mrunal Thakur is not part of Prabhas movie ‘Fauji’

Director Anil Ravipudi to turn hero?