in

keerthy suresh busiest beauty!

ర్కారు వారి పాట ఆశించిన స్థాయిలో పేరు అవకాశాలు తీసుకురాకపోయినా కీర్తి సురేష్ కు ఆ లోటుని దసరా పూర్తిగా తీర్చేసింది. ఏదో రెగ్యులర్ హీరోయిన్ లా కాకుండా పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న వెన్నెల క్యారెక్టర్ దక్కడంతో మహానటి తర్వాత మరోసారి తన బెస్ట్ ఇచ్చేసింది. అయితే శ్రీలీల జోరులో తనకు ఆఫర్లు తగ్గాయని అభిమానులు ఫీలవుతున్నారు కానీ నిజానికి కీర్తి ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలతో ఈ ఏడాది సందడి చేయబోతోంది. అందులో మొదటిది చిరంజీవి భోళా శంకర్. చెల్లెలి పాత్రే అయినా మెగాస్టార్ కాంబినేషన్ కాబట్టి మంచి మెమరీ అవుతుంది.

ఉదయనిధి స్టాలిన్ తో చేసిన మామన్నన్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కర్ణన్ ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకుడు. తెలుగు డబ్బింగ్ డీల్ పూర్తి కాకపోవడంతో టైటిల్ గట్రా వ్యవహారాలు ఇంకా మొదలుకాలేదు. వడివేలు ఇందులో సీరియస్ పాత్ర పోషించగా ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. జయం రవితో చేస్తున్న సైరన్ మీదా భారీ అంచనాలున్నాయి. టైటిల్ రోల్ పోషిస్తున్న రివాల్వర్ రీటా ఇంటెన్స్ డ్రామాతో రూపొందుతోంది. కెజిఎఫ్ నిర్మాతలు హోంబాలే ఫిలిమ్స్ రఘు తాత సైతం డిఫరెంట్ సబ్జెక్టే. ఇవన్నీ 2023లోనే వచ్చేస్తాయి..!!

Rana to produce Dulquer salman’s bilingual?

happy birthday S. P. Balasubrahmanyam!