in

Kavya Maran, Anirudh Ravichander to reportedly marry in Greece!

సోషల్ మీడియాలో రోజుకొక హాట్ టాపిక్ హల్‌చల్ చేయడం సహజమే. కానీ, తాజాగా ట్రెండ్ అవుతున్న ఒక వార్త మాత్రం క్రికెట్ అభిమానులనే కాకుండా, సంగీత ప్రియులను కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ, మిస్టరీ గర్ల్ కావ్య మారన్, సౌత్ ఇండియా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు తెగ వైరల్ అవుతున్నాయి. నవంబర్ 10న వీరి పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది..

అయితే వీరి పెళ్లి దేశంలో కాకుండా గ్రీస్‌లో చేసుకోవాలని భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇరు వర్గాల పెద్దలు ఇప్పటికే ఈ సంబంధానికి పచ్చజెండా ఊపేశారని, డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయని టాక్. అంతేకాకుండా, అనిరుధ్ మావయ్య, ప్రముఖ నటుడు మహేంద్రన్ ఇటీవల వీరి రిలేషన్‌షిప్‌పై పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కొన్ని పుకార్లు తోడవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఏది ఏమైనా, ఐపీఎల్ వేలంలో టీమ్‌ను నడిపించే కావ్య, తన మ్యూజిక్‌తో యూత్‌ను ఊపేసే అనిరుధ్ జోడీకి సంబంధించిన ఈ వార్త మాత్రం ప్రస్తుతం ఫిలిం, క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది..!!

Dhruv Vikram Opens Up After Anupama’s ‘Narcissist’ Remarks!