in

Dhruv Vikram Opens Up After Anupama’s ‘Narcissist’ Remarks!

టీవల నటి అనుపమ పరమేశ్వరన్ తన గతం, ఎదుర్కొన్న మానసిక వేధింపులు గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. ఆమె ఎవరి పేరునూ ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినప్పటికీ, నెటిజన్లు ఆ వ్యాఖ్యలను హీరో ధ్రువ్ విక్రమ్‌తో ముడిపెడుతూ ప్రచారం చేశారు. ఈ పరిణామాలపై ధ్రువ్ విక్రమ్ తాజాగా స్పందించాడు. తన వ్యక్తిగత జీవితంపై హఠాత్తుగా వచ్చిన ఈ విశేషమైన దృష్టి తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని..

ఇది ఎంతో అసౌకర్యానికి గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సాధారణంగా తన పర్సనల్ లైఫ్ గురించి బయట మాట్లాడేందుకు ఇష్టపడని ధ్రువ్, ఇలాంటి అనవసరమైన చర్చలకు ప్రతిస్పందించే కంటే తన దృష్టినంతా సినిమాలపైనే పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అనుపమ వ్యాఖ్యలు, ఆపై సోషల్ మీడియాలో సాగిన ఊహాగానాల చుట్టూ నడిచిన ఈ వివాదంపై ధ్రువ్ స్పందించడం ఇదే తొలిసారి. ఏదేమైనా ప్రత్యక్షంగా పేర్లు చెప్పకపోయినా, సోషల్ మీడియా వల్ల తలెత్తిన ఈ కాంట్రోవర్సీ ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రసీమల్లో హాట్ టాపిక్‌గా మారింది..!!

Balakrishna, Koratala Film on Track, Team Dismisses Rumours!

Kavya Maran, Anirudh Ravichander to reportedly marry in Greece!