in

Kangana Ranaut reacts to Thapsee Pannu calling her ‘irrelevant’!

తాప్సి ఇటీవల కంగనా ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ కావడం గురించి స్పందిస్తూ.. ఆమె ట్విట్టర్ లో లేకపోవడం వల్ల నేనేమి మిస్ కావడం లేదు. కంగనాపై నాకు గుడ్, బ్యాడ్ ఫీలింగ్స్ ఏమీ ఉండవు అని తాప్సి చెప్పింది. కంగనా వ్యక్తిగత జీవితం వల్ల తనకు వచ్చే నష్టం, లాభం ఏమీ ఉండదు అని తాప్సి అవాయిడ్ చేయడానికి ప్రయత్నించింది. కంగనా గురించి మాట్లాడడం ఇర్రెలవెంట్.. నేను ద్రుష్టి పెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని తాప్సి అవాయిడ్ చేసే ప్రయత్నం చేసింది. ఈ కామెంట్స్ పై కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ లో రియాక్ట్ అయింది.

ఒక రేంజ్ లో ఈ ఫైర్ బ్రాండ్ లేడి తాప్సికి చురకలంటించింది. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. తాప్సి ఒక బి గ్రేడ్ నటి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది కంగనా. ఒక బి గ్రేడ్ నటి నా పేరు వాడుకుంటే నాకెలాంటి ఇబ్బంది లేదు. ఆమె ఇండస్ట్రీలో ఎదగడానికి నా పేరు వాడుకుంటోంది అని తెలుసు. నేను కూడా ఇండస్ట్రీలో ఎదగడానికి వైజయంతి మాల, శ్రీదేవి లాంటి వారిని ఆదర్శంగా తీసుకున్నాను. నేను వారిని ఎప్పుడూ కించపరచలేదు. నేను వదిలేసిన సినిమాలు ఇమ్మని దర్శకులని, ప్రొడ్యూసర్స్ ని అడుక్కుంటావు. అప్పుడు నేను ఇర్రెలవెంట్ అనిపించలేదా.

Rajamouli complains about lack of facilities at Delhi airport!

kajal agarwal revealed her secret diet plan!