in

kamal haasan’s indian 2 movie is not shelved!

కానొక ద‌శ‌లో మధ్యలో సినిమా షూటింగ్ కూడా ఆపేసే ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. ఈ మూవీని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ కి గొడవలు, కోర్టు కేసుల వ‌రుకు వెళ్లిందంటే గొడ‌వ‌లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఇదిలా ఉండ‌గానే శంకర్.. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా సినిమా అనౌన్స్ రావ‌డంతో నిర్మాత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో లైకా నిర్మాతలు ‘ఇండియన్ 2’ సినిమా తీసేత వ‌ర‌కు శంకర్ వేరే ఏ మూవీని చేయడానికి ఒప్పుకోం అంటూ కోర్టు మెట్లెక్కారు.

ఇంత వ‌ర‌కు ఇలా ఉంటే.. తాజాగా శంకర్ ‘అపరిచితుడు’ రీమేక్ అనౌన్స్ చేశాడు. ఇక ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో తెలియదు గానీ.. ‘ఇండియన్ 2’ మూవీ మాత్రం ఆగిపోలేదని తెలుస్తోంది. ఈ మూవీ తప్పకుండా పూర్తవుతుందని శంకర్ అనౌన్స్ చేశాడు. ‘ఇండియన్ 2’ సినిమా కోసం విదేశీ నిపుణుల‌ను శంక‌ర్ రప్పిస్తున్నాడ‌ని, కాక‌పోతే కొవిడ్ కారణంగా వాళ్లు ఇండియాకు రావడానికి భయపడుతున్న‌ట్టు స‌మాచారం. ఇక వారు రాగానే సినిమా షూటింగ్ శంక‌ర్ మొదలు పెడ‌తార‌ని స‌మాచారం.

wink girl Priya Prakash varrier learning Telugu for audience!

Samantha gifts a car to a Female auto driver kavitha!