in

Kamal Haasan in talks for Prabhas Project K?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రాజెక్ట్ కె. ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హసన్ ఓ కీ రోల్ లో కనిపించనున్నాడు అనే వార్తలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఈ న్యూస్ పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అందుకే ఈ న్యూస్ ఇంకా రూమర్ గానే ఉంది. అయితే ఈ రూమర్స్ స్ప్రెడ్ అవడానికి కారణం. కమల్ ప్రాజెక్ట్ కె సెట్స్ కు వెల్లడమే.

కమల్ నటిస్తున్న తాజా చిత్రం భారతీయుడు2. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్స్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నాయి. షూటింగ్ గ్యాప్ లో ప్రాజెక్ట్ కె సెట్స్ కి వెళ్ళాడని సమాచారం. దీంతో కమల్ కూడా ఈ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నాడు అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు రానుంది..!!

Aishwarya Rajinikanth to direct Sourav Ganguly biopic?

Allu Arjun’s ‘Pushpa 2’ team meets with a bus accident!