in

kajal getting married to businessman gautham?

35ఏళ్ల ఈ భామ ఇప్పటికీ కూడా టాప్ హీరోల పక్కన నటిస్తూ బీజీగా ఉంది. అయితే ఈ భామ పెళ్లిపై మాత్రం క్లారిటీ రాలేదు. ఆ మధ్య కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పి.. ఓ బిజినెస్ మ్యాన్ ను చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. అయితే అది పుకారుగానే నిలిచింది. కాజల్ చెల్లి నిషా అగర్వాల్ 2013లోనే పెళ్లి చేసుకుంది. ఆమెకు ప్రస్తుతం రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. నిత్యం సినిమాలతో బీజీగా ఉంటున్న ఒకరితో ప్రేమలో ఉందనే టాక్ విన్పిస్తోంది. తాజాగా కాజల్ అగర్వాల్ తన ఇన్ స్ట్రాగ్రామ్లో కాదల్ సింబల్ ను పోస్టు చేసింది. ప్రేమ.. పెళ్లిపై కాజల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ కొందరు నెటిజన్లు ఆమెకు త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాజల్ కాబోయే భర్త ఇతడే అంటూ ఓ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అతడి గురించి ఆరాతీస్తే.. గౌతమ్ కిచ్లుగా తెల్సింది. ఇతడొక ఇంటీరియర్ డిజైనర్. అంతేకాకుండా రెండు, మూడు వ్యాపారాలు కూడా ఉన్నాయట. గౌతమ్ ఇన్ స్ట్రాగ్రాంను కాజల్ అగర్వాల్ ఫాలో అవుతోంది. కాజల్ కుటుంబంతో గౌతమ్ ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయట. వీరిద్దరు ఓ సందర్భంలో కలుసుకున్నారని.. కొంతకాలంగా డేటింగ్ ఉన్నారనే గాసిప్స్ విన్పించాయి. ఈక్రమంలోనే కాజల్ కాదల్ సింబల్ పోస్టు చేసింది. దీంతో కాజల్ ప్రేమ.. పెళ్లిపై ఏదైనా ప్రకటన చేస్తుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

sai dharam tej to get married soon?

can you guess the early professions of our Tollywood producers?