in

kajal gets 15 million followers on instagram!

సినీ పరిశ్రమలో దశాబ్ద కాలంగా పలు భాషల్లో రాణిస్తున్న కాజల్ అగర్వాల్‌‌కు ఎదురే లేకుండా పోయింది. స్టార్ హీరోయిన్‌గా అగ్రహీరోలందరితో కలిసి నటిస్తున్నది. చిరంజీవి, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి సీనియర్ హీరోల నుండి దాదాపు అందరూ కుర్ర హీరోలతో కూడా నటించి మెప్పించింది. తన 13 ఏళ్ళ కెరియర్ లో ఎన్నో రికార్డులు సాధించిన కాజల్ అగర్వాల్ మరో రికార్డు సొంతం చేసుకుంది. తాజాగా ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో15 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. అంటే కోటిన్నర మంది కాజల్ ను ఫాలో అవుతున్నారన్న మాట. . ఇక మన టాలీవుడ్ మొత్తంలో రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత 15 మిలియన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంపాదించుకున్న రెండో హీరోయిన్ కాజల్ మాత్రమే. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, మంచు విష్ణు ‘మోసగాళ్లు’ చిత్రాల్లో నటిస్తోంది. ఇక తమిళంలో కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ మరియు ‘హే సినామికా’ అనే సినిమాలో నటిస్తోంది.

adhiti rao hydari about her role in ‘v’ movie!

oka role cheyadaniki bayapadi jwaram tecchukunna soundarya!