in

Kajal couldn’t sleep throughout the shoot of ‘Live Telecast’!

కాజ‌ల్ న‌టించిన తొలి వెబ్ థ్రిల్ల‌ర్ `లైవ్ టెలీకాస్ట్‌`. జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌పై కాజ‌ల్ భారీ ఆశ‌లే పెట్టుకుంద‌ట‌. కార‌ణం త‌ను న‌టించిన తొలి హార‌ర్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో పాటు తొలి వెబ్ డ్రామా కావ‌డం కూడా ఓ కార‌ణంగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఆరు చిత్రాల్లో న‌టిస్తున్న కాజ‌ల్ `లైవ్ టెలీకాస్ట్‌` వెబ్ సిరీస్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో తాను ఎదుర్కొన్న అనుభ‌వాల గురించి తాజాగా వెల్ల‌డించింది.

ఏకాంత ప్ర‌దేశంలో చిత్రీక‌ర‌ణ చేయ‌డం వ‌ల్ల తాను నిద్ర‌కూడా పోలేద‌ని, ఈ వెబ్ సిరీస్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో తాను నిద్రలేని రాత్రులు గ‌డిపాన‌ని వెల్ల‌డించింది. తాము షూటింగ్ చేసిన ఇల్లు కొండ‌పై వుండేద‌ని, దాని చుట్టుప‌క్క‌ల ప‌రిస‌రాల్లో ఒక్క ఇల్లు కూడా లేద‌ని తెలిపింది. చుట్టూ వాతావ‌ర‌ణం నిర్మానుష్యంగా భ‌యంక‌రంగా వుండేద‌ని కాజ‌ల్ తెలిపింది. ప్యాక‌ప్ చెప్పాక ఇంటికి వెళ్లినా త‌న‌కు నిద్ర స‌ట్ట‌లేద‌ని వాపోయింది.

darling Prabhas ready to give Valentine’s Day gift to fans!

anchor Anasuya bharadwaj Gets Her Own Postal Stamp!