ప్రస్తుతం కాజల్ గర్భవతి. హీరోయిన్ గా సినిమాలు చేయలేని పొజిషన్. కానీ డబ్బు కోసం ఆమె ఎప్పుడైనా సరే పరిధులు దాటడానికి రెడీ అంటుందట పెళ్లి అయ్యాక, సంపాదన కాస్త తగ్గగానే, సంపాదన కోసం సోషల్ మీడియాలో మందు బాటిల్స్ కి కూడా ప్రచారం చేసిందని తెలుస్తుంది..మరి అలాంటి కాజల్ కి ఇప్పుడు కొత్త ఐడియా వచ్చిందట తనకున్న పరిచయాలతో తన భర్త గౌతమ్ కిచ్లూని యాక్టర్ ను చేయాలని ప్లాన్ చేస్తోందని తెలుస్తుంది.తన భర్త గౌతమ్ ను విలన్ గా పరిచయం చేసి నిర్మాతలతో తనకున్న క్లోజ్ నెస్ కారణంగా మంచి వేషాలతో పాటు ఎక్కువ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసి తీసుకోవచ్చు అని కాజల్ ప్లాన్ చేస్తుందట.
అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం కాజల్, హైదరాబాద్ లోనే మకాం పెట్టిందట. తనతో బాగా క్లోజ్ గా మెలిగిన నిర్మాతలను మరియు హీరోలను కలిసి తన భర్తకు వేషాలు ఇప్పించడానికి తెగ కష్టపడి పోతుందట పైగా కొందరు దర్శకులకు ఫోన్ చేసి మరీ తన భర్తకు ఒక మంచి పాత్ర ఇవ్వాలని అడుగుతోందని సమాచారం.ఇక కాజల్ భర్త గౌతమ్ కి కూడా నటనపై ఆసక్తి ఉందని తెలుస్తుంది..అందుకే, కాజల్అందర్నీ తన భర్తకు ఛాన్స్ ఇవ్వాలని బలంగా కొరుకుతోందట. మరి కాజల్ కోరికను ఎవరు తీరుస్తారో చూడాలి మరి. అయితే, కాజల్ ఆలోచనలను మాత్రం నెటిజన్లు తెగ విమర్శిస్తున్నారట. ‘ఛీ.. డబ్బు కోసం నీ మొగుడ్ని కూడా వాడుకుంటావా ‘ అంటూ కాజల్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారట.