కుందనపు బొమ్మ కాజల్‌కి ఇలా పెళ్లైందో లేదో ఫ్యూచర్ గురించి పక్కా ప్రణాళికలు రచిస్తుంది. భర్త బిజినెస్ మెన్, ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ ఇద్దరు కోట్ల కొద్ది డబ్బులు సంపాదిస్తున్నా ఇంకా ఏదో చేయాలనే ఆశ. అందుకేనేమో కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని సన్నాహాలు చేసుకుంటుంది. ఇప్పటికే పలు వ్యాపార రంగాలలో భాగస్వామిగా ఉన్న కాజల్ ఇప్పుడు కొత్తగా ఓకీ అనే గేమింగ్ సంస్థలో పార్ట్నర్షిప్ గా చేరింది.
ఓకీ అనేది ఆన్లైన్ గేమింగ్ సంస్థ కాగా, ఇది వినియోగదారుల కోసం ఎన్నో గేమ్స్‌ని ఆన్లైన్లో ఉంచింది. ఇందులో అమ్మాయిల కోసం ప్రత్యేకమైన గేమ్‌ను కూడా తీసుకురానున్నట్టు సమాచారం. ఈ సంస్థలో కాజల్ 15% వాటాను కొనుగోలు చేయడంతో కీలకంగా మారింది. ముంబైకి చెందిన ఈ సంస్థలో కాజల్ భాగస్వామిగా చేరడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గౌతమ్ ప్రోద్భలంతోనే కాజల్ ఈ బిజినెస్‌లో భాగస్వామి అయిందా అంటూ చర్చలు జరుగుతున్నాయి.