in

ileana injured her palm at shooting!

దేవదాస్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన గోవా బ్యూటీ ఇలియానా..మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యం గా యూత్ అయితే అమ్మడి నడుము ఒంపులకు ఫిదా అయ్యారు. దీంతో అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టడం తో అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ ఆ స్థాయి ని నిలుపుకోలేపోయింది. తన బాయ్ ఫ్రెండ్ కు బై బై చెప్పి..మళ్లీ సినిమాల ఫై ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. హాటెస్ట్ ఫొటోస్ తో తెగ ఆకట్టుకుంటుంది.

నిత్యం బీచ్‌‌ల వెంటే తిరిగే ఇలియానా అందాల ఆరబోతలో స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈమె బ‌ల్వీంద‌ర్ సింగ్ జ‌నుజ ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ్‌దీప్ హుడాతో కలిసి ‘అన్‌ఫెయిర్ అండ్ ల‌వ్‌లీ’ సినిమాలో న‌టిస్తోంది.ఈ షూటింగ్ లో ఉండగా ఇలియానా చేతికి గాయం అయ్యింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన చేతి ఫోటోను షేర్ చేసింది. దీని ఫన్నీ గా కామెంట్ పెట్టింది. ” రొమాంటిక్ కామెడీ సినిమా కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరు గాయపడతారు?” అంటూ చమత్కరించింది..

‘Rowdy’ Becomes The Guest of ‘Sam Jam’ show!

kajal agarwal into new business?