డైరెక్టర్ కె.వి.రెడ్డి గారి చిత్రాలు అస్లీలానికి ఆమడ దూరం ఉండేవి, కనీసం ఒక డైలాగ్ కూడా డబల్ మీనింగ్ లో ఉండేది కాదు. కె.వి.రెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చిన మాయ బజార్ చిత్రం లో ఘటోద్గజుడు శశిరేఖను ఎత్హుకోని వెళ్లేందుకు అంతఃపురంలో ప్రవేశించి, అక్కడ ఉన్న శశి రేఖను చూసి” ఆహ! నా సోదరుడికి తగిన కన్య ” అని డైలాగ్ చెప్పాలి,అక్కడ ఎస్.వి.ఆర్. కి ఒక సందేహం వచ్చింది రాత్రి పూట కాబట్టి ఆ డైలాగు మెల్లగా చెప్పాలా? లేక రాక్షసుడు కాబట్టి బిగ్గరగా చెప్పాలా? అనే సందేహం వచ్చింది, వెంటనే అదే విషయాన్ని డైరెక్టర్ని అడిగారు. సీ, మిస్టర్ రంగ రావు ఇక్కడ డైలాగ్ చెప్ప వలసిన అవసరం లేదు, మీరు శశి రేఖను సంతోషం గ చూడాలి, సంతోషం గ చూడటం అంటే ఇక్కడ తప్పుడు ఎక్స్ప్రెషన్ వచ్చే అవకాశం ఉంది అందుకే ఆ డైలాగ్ ఇచ్చాము..
దానిని మనసులో అనుకోని దానికి తగినట్లుగా ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు అని చెప్పారట కె.వి.రెడ్డి. డైరెక్టర్ గారి మనోగతాన్ని అర్ధం చేసుకొన్న ఎస్.వి.ఆర్. ఆ డైలాగ్ ను మనసులోనే అనుకోని దానికి తగిన లాలన భావం కలిగే ఎక్స్ప్రెషన్ ఇచ్చారట.. ఇంత నిబద్ధత కలిగిన దర్శకులు, మనసులో డైలాగ్ అనుకోని దానికి తగిన ఎక్స్ప్రెషన్ పలికించ గలిగిన ఫేసులు ఇప్పుడు ఉన్నయంటారా? . ఇప్పుడంతా నాటు కొట్టుడు నటులు, సెట్లోకి వచ్చి డైలాగ్లు రాసే డైరెక్టర్లు ఉన్న కాలం, సెట్లో కట్ చెప్పినప్పుడల్లా పగలబడి నవ్వేయటం తప్ప ఇంత లోతుగా అలోచించి డైలాగ్లు రాసే వారు లేరు, నటించే వారు అంత కంటే లేరు. సామాజిక విలువలు పడిపోయిన ఈ రోజుల్లో, సినిమాను వేరు చేసి ఎలా చూడగలం సమాజంలోని ఒక భాగమే కదా..!!