యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసే డైనమిక్ రోల్స్ ఇంకా అతను డైలాగ్ చెప్పేటప్పుడు బాడీ లాంగ్వేజ్ చూస్తే.. సినిమాల పరంగా ఎంత స్ట్రిక్ట్ గ ఉంటాడో మనకు ఇట్టే అర్ధం అవుతుంది. అంత స్ట్రిక్ట్ గ ఉండే మన తారక్ ఒకసారి ‘నేను ఈ సినిమా చేయను, ఇంటికి వెళ్ళిపోతాను’ అని ఏడుస్తూ మారాం చేసాడట..నమ్మసక్యంగా లేదు కదా..కానీ ఇది పచ్చి నిజమండి బాబు.. అయితే తారక్ ఇలా మారం చేసింది ఇప్పుడు కాదు చిన్నతనంలో తాను నటించిన ‘బాల రామాయణం’ సినిమా సమయంలో..బాల్యం లో తారక్ చాల అల్లరి చేసేవాడట..అల్లరి అంటే అందరూ పిల్లలు చేసే మాములు అల్లరి టైపు కాదు..అదేంటో తెలియాలి అంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవాల్సిందే!
గుణశేఖర్ 1996 లో తీసిన ‘బాల రామాయణం’ సినిమాలో నటించిన వారంతా పిల్లలు అన్న విషయం అందరికి తెలిసిందే. షూటింగ్ సమయంలో తారక్ ఆ పిల్లలను బాగా ఏడిపించేవాడట, బాణాలు విరగొట్టడం,బాణాలు వేసి ఏడిపించడం ఇలా వీరలెవెల్లో అల్లరి చేసేవాడట.ముఖ్యంగా శివధనస్సు కోసం టేకుతో ఓ విల్లు తయారు చేయించారట.దాంతో పాటు ఓ డూప్లికేట్ విల్లుని కూడా రూపొందించారట.అయితే షూటింగ్ సమయంలో అంతా సిద్ధం చేసుకుంటుంటే,జూనియర్ ఎన్టీఆర్ మిగతా పిల్లలతో కలిసి అల్లరి చేసేవాడట.అంతటితో ఊరుకోకుండా అక్కడ పెట్టిన డూప్లికేట్ శివధనస్సు ను ఎత్తడం మొదలెట్టారట.అది ఈజీగానే ఉండడంతో ఒరిజనల్ టేకు విల్లు ఎలా ఉంటుందోనని,వెతికి వెతికి దాన్ని కూడా ఎత్తేప్రయత్నం చేశారట.అయితే ఎవరి వల్లా కాకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నించి మొత్తానికి బలవంతంగా ఎత్తేశాడట. అయితే ఆసమయంలో జూనియర్ కిందపడిపోవడం,విల్లు విరిగిపోవడం జరిగిపోయాయి.దీంతో డైరెక్టర్ గుణశేఖర్ కి కోపం తన్నుకొచ్చేసి,చెడామడా తిట్టిపోశాడట. డైరెక్టర్ తిట్టడంతో ఫీల్ అయినా మన బుల్లి రాముడు ఈ సినిమా చేయనని ఇంటికి వెళ్లిపోతానని ఏడుస్తూ బాగా మారాం చేసాడట. తారక్ ను ఇలా చూసే సరికి అందరూ కరిగిపోయి బుజ్జగించారట.. స్టోరీ మొత్తం చదివారు కదా, ఇప్పుడు అర్ధం అయినట్టుంది తారక్ చిన్నప్పుడు ఏ రేంజ్ లో అల్లరి చేసేవాడో!!