ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా బ్యాక్ డ్రాప్
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నీల్..ఎన్టీఆర్ మాస్ అటిట్యూడ్ తో మరో పాన్ ఇండియా సెన్సేషన్ తేవబోతున్నాడు. తాజాగా లీకైన డీటైల్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమా కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ కాదు, గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా నేపథ్యంలో ఒక ఇంటెన్స్ స్టోరీ అని సమాచారం..
గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా నేపథ్యంలో NTR31 స్టోరీ
ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఈశాన్య మయన్మార్, థాయిలాండ్, లావోస్ ప్రాంతాల మధ్య ఉన్న డ్రగ్స్ హబ్. 1950ల నుంచి ఈ ప్రాంతం హెరాయిన్, ఓపియం సరఫరా చేసే గ్యాంగ్స్ గల మాఫియా రాజ్యంలో మారింది. సినిమాలో ఒక సామాన్య వ్యక్తి ఈ గోల్డెన్ ట్రయాంగిల్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడే లీడర్‌గా ఎదిగే కథా వెనుక ఉండే యాక్షన్, రివేంజ్, లీడర్‌షిప్ అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు..!!