in

jr ntr fulfills his fan dream!

నారోగ్యంతో బాధపడుతున్న అభిమానిలో ధైర్యం నింపారు… హీరో ఎన్టీఆర్‌. నేరుగా వీడియో కాల్‌లో మాట్లాడి… సాయం చేస్తానని మాటిచ్చారు. కరోనా కంట్రోల్లోకి వచ్చాక కలిసి సెల్ఫీ కూడా ఇస్తానని హామీ ఇవ్వడంతో… ఆ అభిమాని ఎంతో సంబరపడిపోయాడు. నల్గొండ జిల్లా చండూరుకు చెందిన వెంకన్న అనే ఈ యువకుడికి… హైదరాబాద్‌ ఎల్బీనగర్లో యాక్సిడెంట్‌ కావడంతో స్పైనల్‌ కార్డ్‌ దెబ్బ తినింది. దాంతో శరీరం చచ్చు బడిపోయి మంచానికే పరిమితమైపోయాడు. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించినా… నయం కాలేదు.

దాంతో భారంగా రోజులు నెట్టుకొస్తున్నాడు వెంకన్న. వెంకన్న… హీరో ఎన్టీఆర్‌ అభిమాని. ఒక్కసారైనా ఎన్టీఆర్‌ కలిసి ఫోటో దిగాలని అనుకునేవాడు. కానీ యాక్సిడెంట్‌ కారణంగా ఎక్కడికీ కదల్లేని పరిస్థితి. అతని గురించి తెలుసుకున్న ఎన్టీఆర్‌… వీడియో కాల్ చేశారు. ఆత్మీయంగా మాట్లాడి… అతనిలో ధైర్యం నింపారు. ఎన్టీఆర్‌ కలవాలన్న ఆశతో అయినా బతుకుతానని వెంకన్న చెప్పాక… నీకూ, నాకూ ఏమీ కాదన్న ఎన్టీఆర్‌… ఆరోగ్యాన్ని, అమ్మనీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు..

TRIVIKRAM’S NEXT WITH RAM AND ANUPAMA?

niharika konidela marriage date confirmed!