పూరీ జగన్నాథ్ తను విజయ్ దేవరకొండ తో చేస్తున్న ‘ఫైటర్’ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ ను హీరోయిన్‌గా తీసుకుని, టాలీవుడ్‌కి పరిచయం చేయాలని ప్రయత్నించాడు. కానీ ఆమె బిజీగా ఉన్నానంటూ ఈ ఆఫర్‌ను కూడా తిరస్కరించింది. కానీ ఇప్పుడు ఆమె టాలీవుడ్ ఆఫర్స్ వదులుకుని తప్పు చేశానని ఫీలవుతుందట. దీనికి కారణం ఆమె చేసిన బాలీవుడ్ చిత్రాలన్నీ థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల అవుతున్నాయి.
వెండితెరపై తన వైభవాన్ని చూసుకోవాలనుకున్న ఆమె కోరిక నెరవేరలేదట. దీంతో ఆమె బాగా డిజప్పాయింట్ అవుతుందట. అందుకే టాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లను ఎందుకు వదులుకున్నానా? అని ఫీలవుతుందట జాన్వీ కపూర్. అయితే ఎక్కడైనా ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి కదా.! థియేటర్స్ తెరుచుకునే అవకాశం లేనప్పుడు ఏ నిర్మాతలైనా.. చేసేది అదే కదా..! దీనికి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది అంటూ ఆమె సన్నిహితులు జాన్వీని సముదాఇస్తున్నారట.