రాజశేఖర్ హీరోగా చేస్తున్న ఓ సినిమాలో జీవితను హీరోయిన్గా తీసుకోవాలని నిర్మాతలు అనుకున్నారట. కానీ దీనికి రాజశేఖర్ అంగీకరించలేదు. సినిమాలో హీరోయిన్‌ది బబ్లీగా, గ్లామరస్‌గా ఉండే పాత్ర అని, అలాంటి పాత్రలో హోమ్లీగా ఉండే జీవిత సరిపోదని నిర్మాతలకు రాజశేఖర్ సూచించారట. దానికి దర్శక, నిర్మాతలు కూడా సరేనని చెప్పి రాజశేఖర్‌ను పంపించేశారట.4 రోజుల్లో షూటింగ్ మొదలు కావల్సి ఉండగా..
10 రోజులైనా అవతలి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో నిర్మాతలకు ఫోన్ కూడా చేశారట. కానీ అవతలి వారి కనీసం ఫోన్ లిఫ్ట్ చేసిన పాపాన కూడా పోలేదట. చివరకు సినిమాలో తననే మార్చేశారని, హీరోగా వేరేవారిని తీసుకున్నారని తెలిసి రాజశేఖర్ షాక్ తిన్నారట. అయితే ఆ తరువాత జీవిత, రాజశేఖర్.. ఇద్దరూ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టడం, ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకోవడం, ఆ తర్వాత ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది..