in

Jathi Ratnam Chitti To Romance Santosh Shoban!

హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ‘జాతి రత్నాలు’ చిత్రంతో చిట్టిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో ప్రేక్షకులు ఆమె పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆమెను ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లలో కూడా ‘చిట్టి’ అని పిలుస్తున్నారు. కాగా ఈ చిట్టి ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ తో రొమాన్స్ చేయనుందని వార్తలు విన్పిస్తున్నాయి. సంతోష్ శోబన్ తదుపరి చిత్రం కోసం చిట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. సంతోష్, ఫరియాల రొమాన్స్‌కి మంచి స్కోప్ ఉన్న ఆసక్తికరమైన కథ రాబోతోందని తెలుస్తోంది.మేర్లపాక గాంధీ ఈ ప్రాజెక్ట్ ను చేపట్టబోతున్నారట…

గతంలో సంతోష్‌ తో యువి క్రియేషన్స్‌లో గాంధీ ‘ఏక్ మినీ కథ’ అందించారు. ఈ సినిమా డీసెంట్ హిట్ అందుకుంది. ఇప్పుడు మరోసారి సంతోష్ , మేర్లపాక కాంబోలో ఫరియా హీరోయిన్ గా రెండవ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రాన్ని ‘శ్యామ్ సింగరాయ్‌’ని పంపిణీ చేసిన వెంకట్ బోయనపల్లి నిర్మించబోతున్నారు. ఈ చిత్రం వెంకట్ రెండో ప్రొడక్షన్‌గా రాబోతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న సంతోష్, ఫరియాల సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మేకర్స్ ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

jersey beauty bags bunch of crazy offers!

how much do you know about these 5 star families!