in

Janhvi Kapoor’s Special song In Allu Arjun’s Pushpa 2?

నార్త్‌లో ‘ఊ అంటావా’ సాంగ్ ఓ ఊపు ఊపేసింది. బాలీవుడ్‌లో ఆ సాంగ్‌కు స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ సాంగ్ చేశాక సమంతకు వచ్చిన క్రేజ్‌ అంతా ఇంత కాదు. ఆ క్రేజ్‌నే సొంతం చేసుకునేందుకు ఇప్పుడు జాన్వీ ప్రయత్నిస్తోందట. తాను ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్‌తో ‘దేవర’ లాంటి పెద్ద సినిమా చేస్తున్నా పుష్ప2లో మాత్రం ఐటెమ్ సాంగ్ చేసే ఛాన్స్ మిస్ చేసుకోకూడదని జాన్వీ నిర్ణయించుకుందట..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఆర్సీ16కి జాన్వీ కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్‌కి ఇండియా వైడ్‌గా ఉన్న పాపులారిటీని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని చూసి ఐటెమ్ సాంగ్ చేస్తే భారీ ఇమేజ్ వస్తుందని అనుకుందట. మొత్తానికి జాన్వీ భారీ ప్లానే వేసిందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పుడు ఆ గోల్డెన్ ఛాన్స్‌ను అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కొట్టేసింది..!!

Keerthy Suresh removed from Ajay Devgn’s upcoming film Maidaan!

Ram Charan to reunite with ‘Pushpa’ director Sukumar!