in

Janhvi Kapoor leaves Karan Johar’s Dharma Productions!

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ తీసుకున్న ఒక నిర్ణయం ఇండస్ట్రీని షాక్‌కి గురిచేస్తోంది. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసి, వెన్నంటి నిలిచిన స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జొహార్‌కు ఆమె షాకిచ్చింది. ఆయనకు చెందిన ‘ధర్మా ప్రొడక్షన్స్’ టాలెంట్ మేనేజ్‌మెంట్ నుంచి బయటకు వచ్చేసింది. ఇకపై సొంతంగా తన కెరీర్ నిర్ణయాలు తీసుకుంటానని జాన్వీ ఫిక్స్ అయ్యింది. ఇన్నాళ్లూ ఏ సినిమా చేయాలి, ఏ బ్రాండ్‌కు ప్రచారం చేయాలి అన్నదంతా కరణ్ జొహార్ కనుసన్నల్లోనే జరిగేవి..

దీంతో ఆమెపై ‘నెపో కిడ్’ ముద్ర బలంగా పడింది. ఆ విమర్శల నుంచి బయటపడటానికే జాన్వీ ఇప్పుడు ‘కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్‌వర్క్’ అనే కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తల్లి శ్రీదేవి లాగే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని స్టార్‌డమ్ సంపాదించాలని ఆమె గట్టిగా నిశ్చయించుకుంది..ప్రస్తుతం జాన్వీ ఫోకస్ మొత్తం సౌత్ సినిమాలపైనే ఉంది. ‘దేవర’తో భారీ విజయం సాధించిన ఆమె, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘పెద్ది’లో నటిస్తోంది. అంతేకాదు, అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో రాబోయే భారీ ప్రాజెక్ట్‌లోనూ జాన్వీ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం.!!

N.T.R SLAPPED HARI KRISHNA!

Prabhas rewarded ‘the rajasaab’ team despite the mixed talk!