జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. “హిందీ చిత్ర పరిశ్రమలో అవకాశాలు బాగానే వచ్చాయి. అతి తక్కువ సమయంలోనే నేను మంచి పాత్రల్లో నటించి మెప్పించాను. అయితే, నేను తెలుగు చిత్రసీమలో రాణించాలనేది మా అమ్మగారి కోరిక. అది నెరవేర్చాలని దక్షిణాదిలో సినిమాలు చేయాలనుకుంటున్న సమయంలోనే నాకు తెలుగులో ఆఫర్లు వచ్చాయి. అందులో దేవర ఒకటి. అప్పుడే కోలీవుడ్‌లో కూడా ఓ మూవీ ఛాన్స్ వచ్చింది.
ఇలా రెండు ఒకేసారి రావడంతో కొంచెం కన్ఫ్యూజన్‌లో పడిపోయాను. ఆ సమయంలో నిర్మాత, దర్శకుడు కరణ్‌జోహార్ నాకు ఓ మంచి సలహా ఇచ్చాడు. ముందు ఎన్‌టీఆర్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వు. ఆ తర్వాత వాటంతట అవే మంచి ఆఫర్లు వస్తాయని సూచించాడు. ఆయన చెప్పినట్లే మొదట దేవర ఒప్పుకున్నాను. ఆ సలహా నా కెరీర్‌కు బాగా కలిసొచ్చింది. దేవర రిలీజ్ కాకుండానే గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సరసన నటించే అవకాశం వచ్చింది. ఇంకా కొన్ని ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజీలో ఉన్నాయి..!!