in

jagapathi babu to act in ‘pushpa’ movie!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ’పుష్ప‘. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన స్ర్కిప్ట్‌ను ఇప్పటికే సుకుమార్ సిద్ధం చేశారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. దీంతో ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియను ఇప్పటికే సుకుమార్ ప్రారంభించారు. అయితే ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబును కీలక పాత్ర కోసం సుకుమార్ తీసుకోబోతున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

అయితే ముందుగా ఓ బాలీవుడ్ నటడిని తీసుకోవాలనుకున్నారని, అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా జగపతి బాబును తీసుకోవాలని సుకుమార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ’నాన్నకు ప్రేమతో…‘, ’రంగస్థలం‘ సినిమాల్లో జగపతి బాబు కీలక పాత్రల్లో నటించి తన అద్భుత నటతో మెప్పించారు. ఈ క్రమంలోనే ’పుష్ప‘ సినిమాలో కూడా జగపతి బాబు పాత్ర చాలా నేచురల్ గా ఉంటుందని టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది.

rakul preet going to vikarabad forest!

anu emmanuel is not worthy now!