in

Jabardasth beauty Anasuya slams a netizen for age-shaming her!

యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. అనసూయ ఏ పోస్ట్ చేసినా, ఏ ఫోటోను షేర్ చేసినా, కామెంట్ చేసినా కూడా నెట్టింట్లో అది వైరల్ అవుతుంటుంది. ఇక నెటిజన్లు చేసే నెగెటివ్ కామెంట్ల మీద సైతం అనసూయ రియాక్ట్ అవుతుంటుంది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో.. ఓ నెటిజన్ అనసూయని రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశాడు. మిమ్మల్ని ఆంటీ అని పిలవాలా లేక అక్క అని పిలవాలా అని అడిగాడు. అతడి ఉద్దేశం అర్థం చేసుకున్న అనసూయ ఘాటుగా బదులిచ్చింది. అసలు ఎలాగూ పిలవద్దు. నువ్వు అలా పిలవడానికి నేనెవరో అంతగా తెలియదు… మన మధ్య చనువు లేదు అని చెప్పింది.

పైగా నువ్వు చెప్పింది ఏజ్ షేమింగ్ కిందికి వస్తుంది. మీ పెంపకంపైనే నాకు అనుమానంగా ఉంది అంటూ అనసూయ సదరు నెటిజన్ పై అసహనం వ్యక్తం చేసింది. అయితే అనసూయ సమాధానంపై కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్క అని పిలవడం ఏజ్ షేమింగ్ కాదు. అలాంటప్పుడు కాంప్లిమెంట్స్ కూడా స్వీకరించవద్దు అని అనసూయకి సూచించారు. దీనికి అనసూయ బదులిస్తూ.. అది ఏజ్ షేమింగ్ కాకపోవచ్చు.. కానీ నా ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి అని అనసూయ బదులిచ్చింది. ఇక కాంప్లిమెంట్స్ తీసుకోవాలా వద్దా అనేది నాకు సంబందించిన విషయం అని అనసూయ పేర్కొంది.

తనపై ట్రోలింగ్ పెరిగేకొద్దీ తాను, తన ఫ్యామిలీ మరింత స్ట్రాంగ్ గా మారినట్లు అనసూయ తెలిపింది. మ‌రో నెటిజన్ ట్రోలింగ్, దాని వల్ల ఫ్యామిలీ బాధపడిన తీరు గురించి అడిగాడు. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అని ప్రశ్నించాడు. దానికి అనసూయ అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ట్రోలింగ్‌ను పట్టించుకోవద్దనే విషయాన్ని నేర్చుకున్నాను. కెరీర్ ప్రారంభంలో నన్ను, నా ఫ్యామిలీని తెగ ఇబ్బంది పెట్టింది. కర్మ సిద్దాంతాన్ని నేను నమ్ముతాను..రోడ్డు మీద మనం ఉమ్మేస్తే.. మన మీద ఇంకొకడు ఉమ్మేస్తాడు.. రోడ్డు మీద ఒకడు మూత్రం పోస్తే.. వాడి బెడ్డు మీద ఇంకొకడు మూత్రం పోస్తాడు.. ఒకరిని నువ్ తిడితే.. ఇంకొకరు నిన్ను తిడతారు.. నువ్ ఒకడిని బాధ పెడితే.. నిన్ను ఒకరు బాధపెడతారు.. అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.

Is Samantha Pregnant In ‘Yashoda’?

actress Divyaa Dwivedi Latest Photoshoot Stills!