తన కామికల్ రోల్స్ తో తెలుగు ఆడియెన్స్ ను అమితంగా నవ్వించి ఎన్నో చిత్రాలు అందించిన టాలెంటెడ్ నటుడు “అల్లరి” నరేష్ ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో కనిపించి అలరించాడు. అయితే ఒక్క కామెడీ రోల్స్ లో మాత్రమే కాకుండా పలు నెగిటివ్ రోల్స్ లో కూడా కనిపించి తనలోని మరో కోణాన్ని నరేష్ చూపించాడు. అయితే అలా కామెడీ రోల్స్ కు దూరం మరింత వినూత్నతను చూపడానికి చేపట్టిన ఆసక్తికర ప్రయోగమే “నాంధి”. విజయ్ కనక మేడల దర్శకత్వం వహించిన ఈ ఆసక్తికర ప్రాజెక్ట్ కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఊహించని హైప్ ను తెచ్చుకొన్నాడు. అక్కడ నుంచి మొదలయిన ఈ చిత్రం ఇపుడు షూటింగ్ కు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ మరో ఆసక్తికర పోస్టర్ ను విడుదల చెయ్యడంతో తెలిపారు. మొదటి నుంచీ మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రానికి ఓటిటి నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయని టాక్ వినిపిస్తుంది.