in

“It Has Hit Me Real Hard,” says bahubali beauty nora fatehi!

తాజాగా మరో బాలీవుడ్‌ అందాల తార.. బాహుబలి బ్యూటీ ‘ నోరా ఫతేహి’ కొవిడ్‌ బారిన పడింది. సోషల్ మీడియా ద్వారా ఆమే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. ‘ప్రస్తుతం నేను కరోనాతో పోరాడుతున్నాను. నిజం చెప్పాలంటే ఈ వైరస్‌ నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. గత కొద్ది రోజులుగా మంచానికే పరిమితయ్యాను. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నా.

దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి. మాస్కులు ధరించండి. వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారి ప్రతి ఒక్కరిపై ఏదో ఒక విధంగా ప్రభావం చూపిస్తుంది. అలా నాపై కూడా బాగా ఎఫెక్ట్‌ చూపింది . కరోనా ఎవరికైనా రావచ్చు.. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను వైరస్‌పై విజయం సాధించడానికి ప్రయత్నిస్తున్నాను.. ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. జాగ్రత్తగా.. సురక్షితంగా ఉండండి’ అని ఫ్యాన్స్‌కు సూచించింది నోరా ఫతేహి.

ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్‌’ సినిమా ‘ఇట్టాగే రెచ్చిపోనా’ అంటూ మొదటిసారి టాలీవుడ్‌ ఆడియన్స్‌ను పలకరించిందీ అందాల తార. ఆ తర్వాత ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ పాటతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ తెచ్చుకుంది. ‘కిక్‌2’, ‘షేర్‌’ ‘లోఫర్‌’, ‘ఊపిరి’ సినిమాల్లోని పాటలకు కూడా అద్భుతంగా డ్యాన్స్‌ చేసి అలరించింది. ఇక సోషల్‌ మీడియాలోనూ ఆమెకు అశేష అభిమానగణం ఉంది. నిత్యం తను షేర్‌ చేసే గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలకు లక్షలాది లైకులు, కామెంట్లు వస్తుంటాయి.

Sai Pallavi secretly watched ‘Shyam Singha Roy’ in theatre wearing ‘burqa’!

Jr NTR’s public disclosure of his depression about series of flops!