in

ismart beauty has 2 releases for this pongal!

లుగునాట ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న నిధి అగర్వాల్.. ఈ ఏడాది కోలీవుడ్ లోనూ అడుగుపెడుతోంది. జయం రవి 25వ చిత్రం ‘భూమి’తో పాటు శింబు హీరోగా నటించిన ‘ఈశ్వరన్’లోనూ నిధి నాయికగా నటించింది. ఈ రెండు సినిమాల్లోనూ పల్లెటూరి అమ్మాయిగా సందడి చేయనుంది ఈ ‘సవ్యసాచి’ సుందరి. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా 2021 పొంగల్ బరిలోనే దిగుతున్నాయి.

‘భూమి’ చిత్రం పొంగల్ స్పెషల్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంటే.. ‘ఈశ్వరన్’ జనవరి 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మరి.. ఈ రెండు సినిమాలతో నిధి అగర్వాల్ ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.కాగా, ప్రస్తుతం నిధి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో నాయికగా నటిస్తోంది. ఈ సంవత్సరంలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

jhanvi kapoor gives green signal to bellamkonda sreenivas?

king nagarjuna’s ‘wild dog’ to skip theatres!