in

indraja shocking comments about casting couch in cine industry!

మద్య కాలంలో ఈమె బుల్లి తెరపై తెగ సందడి చేస్తున్నారు. జబర్దస్త్ కు గెస్ట్ జడ్జ్ గా వచ్చిన ఇంద్రజ అందరి మనసులను దోచుకున్నారు. రోజా అవసరం లేదు ఇక ఎప్పటికి ఇంద్రజ కావాలంటూ కొందరు  సోషల్ మీడియా ద్వారా కోరుకున్నారు. అంతగా ఆమె ను జనాలు ఆధరించారు. ఆమెకు దక్కిన ఆధరణ నేపథ్యంలో ఆమెను శ్రీదేవి డ్రామా కంపెనీకి పర్మినెంట్ జడ్జ్ గా తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు.

తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతి ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ లైంగిక వేదింపులు ఉంటాయని.. అయితే అమ్మాయిలు ధైర్యంగా వాటిని ఎదుర్కొని నిలవాలంటూ ఈ సందర్బంగా ఆమె చెప్పుకొచ్చారు. ఇంకా ఇంద్రజ మాట్లాడుతూ.. అవకాశాల కోసం మనోభావాలను చంపుకుని పని చేయాల్సిన అవసరం లేదు. అలా చేయకుండా కూడా కష్టపడి అవకాశాలు సంపాదించుకోవచ్చు. వేదింపులు ఉన్నాయి అంటూ పారిపోకుండా.. వాటిని ఎదుర్కొని నిలవాల్సి ఉంటుంది.

ఎక్కడ అయితే అవకాశం కోసం వెళ్లాలనుకుంటున్నారో అక్కడి మనుషుల గురించి ముందే తెలుసుకుని దానికి తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి.  అవకాశాలు ఇప్పిస్తాను అనగానే వ్యక్తిత్వం చంపుకుని వారు చెప్పిన పని చేయనక్కర్లేదు అంటూ ఈ సందర్బంగా ఆమె చెప్పుకొచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ నాకు ఎప్పుడు ఇబ్బంది కాలేదు అని… నా వరకు నేను ప్రతి విషయంలో జాగ్రత్తగా క్లారిటీగా ఉంటూ వచ్చాను. నా వ్యక్తిత్వం కాపాడుకుంటూ వచ్చాను. నాకు కెరీర్ ఆరంభంలో ఎలాంటి చేదు అనుభవాలు తారసపడలేదు. నేను ఇండస్ట్రీలో సెటిల్ అయిన తర్వాత కూడా నన్ను ఏ ఒక్క ప్రముఖులు కూడా ఇబ్బంది పెట్టలేదంది.

Rashmika wants to act in the biopic on Soundarya!

Maestro!