in

i was rejected more than 100 times : divi vadthya

హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ (టీవీ) 2020 టైటిల్ ను సొంతం చేసుకున్న ఆమె ఇప్పుడు అందరి నోట్లో నానుతోంది. తనకు వచ్చిన పేరును కాపాడుకుంటూ.. తనలోని టాలెంట్ ను ప్రైవేటు సాంగ్ తో ప్రదర్శించటమే కాదు.. ఇంత హుషారైన అమ్మాయికి అవకాశాలు ఇవ్వాలన్న పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవటంలో సక్సెస్ అయ్యింది. తాజాగా ఒక యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.  తనకు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ టైటిల్ సొంతం చేసుకున్నట్లుగా ఫోన్ రావటంతో ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా చెబుతోంది దివి.

ఈ టైటిల్ ను సొంతం చేసుకోవటానికి తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని చెప్పింది. తనకు సినిమాల మీద ఉన్న ఆసక్తితో చాలా మూవీ ఆడిషన్స్ కు వెళ్లానని.. కానీ.. తనను వంద సార్లకు పైనే రిజెక్టు చేసిన షాకింగ్ నిజాన్ని ఓపెన్ గా చెప్పేసింది. అయితే.. తనను తిరస్కరించిన ప్రతిసారీ మరింత బలంగా తయారయ్యేదానినని.. త్వరలో తాను చిరు మూవీలో చేస్తున్నట్లు చెప్పింది. పెద్ద సినిమాల్లో ఆఫర్ రావటం సంతోషంగా ఉందన్న ఈ భామ.. ఇలాంటి రోజు కోసమే తాను చాలాకాలంగా వెయిట్ చేస్తున్నట్లు చెప్పింది. హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గని అందచందాలతో పాటు.. కవ్వించే కళ్లు.. మత్కెక్కించే ఆకర్షణ మాత్రమే కాదు.. చాలామందిలో కనిపించని హుషారు దివీ సొంతం.

shocking, teja sajja 1 Cr Remuneration For Hanu-Man!

Catherine Tresa Hot Show at an Event!