in

I stole mangoes in childhood: rashmika

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు.. తమిళం.. కన్నడం లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ప్రస్తుతం అంతా సవ్యంగా ఉంటే అల్లు అర్జున్ తో కలిసి శేషాచల అడవుల్లో సుకుమార్ దర్శకత్వంలో షూటింగ్ లో పాల్గొనేది. కరోనా కారణంగా ఈమె పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది. షూటింగ్స్ లేకపోవడంతో ఎక్కువగా సోషల్ మీడియాలో ఈమె టైమ్ పాస్ చేస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన రష్మిక పలు విషయాల గురించి స్పందించింది.

ఈ సందర్భంగా రష్మిక అభిమాని ఒకరు మీ జీవితంలో జరిగిన ఫన్నీ సంఘటన ఏంటి అంటూ ప్రశ్నించగా తన చిన్నప్పటి ఒక దొంగతనం విషయాన్ని చెప్పుకొచ్చింది. స్నేహితురాలితో కలిసి ట్యూషన్ కు వెళ్లి వస్తున్న సమయంలో దారిలో ఒక ఇంట్లో మామిడి చెట్టు కనిపించింది. ఆ మామిడి చెట్టుకు ఉన్న మామిడి కాయలు తెంచాలనుకున్నాము. ఎవరు లేని విషయాన్ని చూసి చెట్టు ఎక్కి మామిడి కాయ తెంచాము. అప్పుడే ఆ ఇంట్లోనుండి ఆంటీ బయటకు రావడంలో ఇద్దరం పరుగు పెట్టామని రష్మిక చెప్పుకొచ్చింది. తన జీవితంలో ఆ దొంగతనం ఎప్పటికి మర్చిపోలేను అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

kalakarula goppa manasu yela untundho cheppina bapu garu!

56 years for ‘RAMUDU BHEEMUDU’!