[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]క[/qodef_dropcaps] మల్ హాసన్ గారి కూతురు సౌత్ ఇండియన్ పాపులర్ హీరోయిన్స్ లో ఒకరైన శృతి హాసన్ గారు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారట, ఈ విషయాన్నీ తనే స్వయంగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం విశేషం..
శృతి తన ఇంస్టాగ్రామ్ లో ” నేను ఈ పోస్ట్ ని షేర్ చేయడానికి ఇంతముందు నేను పోస్ట్ చేసిన పాతవే కారణం, నాకు వేరే వాళ్ళ ఒపీనియన్ అక్కర్లేదు, నేను చాల లావు అయ్యి మళ్ళి సన్నగా అయిపోయాను అని చాల మంది కామెంట్స్ చేస్తున్నారు, ఈ రెండు పిక్స్ నేను 3 డేస్ గ్యాప్ లో తీసుకున్నవి, నాకు మెంటల్‌గా ఫిజికల్‌గా హార్మోనల్ సమస్యలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పాటు నా హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అది అంత సులువు కాదు. బాధ భరించడం అంత సులువు కాదు, శారీరకంగా జరిగే మార్పులను తట్టుకోవడం అంత తేలిక కాదు, నేను ప్లాస్టిక సర్జరీ చేయించుకున్నాను. ఈ విషయం చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడటంలేదు. నేను ప్లాస్టిక్ సర్జరీలను సపోర్ట్ చేయడంలేదు. అలాగని వాటికి వ్యతిరేకిని అని కూడా చెప్పను. మనం ఎలా బతకాలని అనుకుంటున్నాం అన్నదే ముఖ్యం” అని శృతి తెలియ చేసింది.