in

I don’t have daddy or mommy helping me, says shruthi haasan!

తాను ఎవ‌రిపై ఆధార‌ప‌డనంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అమ్మ‌, నాన్న సాయం నేను ఎప్పుడు తీసుకోను. నా కాళ్ల మీద నిల‌బ‌డ‌టానికే నేను ప్ర‌య‌త్నిస్తాను. నా ఖ‌ర్చుల‌కి నేనే సంపాదించుకుంటాను. నా బిల్లులు చెల్లించుకోవాలి అంటే ప‌ని చేయ‌క త‌ప్ప‌దు. లేదంటే ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి. గ‌తంలో ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాను. క‌రోనా ఎప్పుడు అంతం అవుతుంది అనే దాని కోసం నేను వెయిట్ చేయ‌ను.

నేను ఒప్పుకున్న ప్రాజెక్ట్ నుండి పిలుపు వ‌స్తే షూటింగ్‌కు వెళ‌తాను. అంద‌రిగానే నాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాటి కోస‌మైన ప‌ని చేయ‌క త‌ప్ప‌దు. వ్య‌క్తిగ‌తం, వృత్తి ప‌ర‌మైన నిర్ణ‌యాలు సొంతంగా తీసుకుంటాను. క‌రోనా వ‌ల‌న చాలా మంది ఖరీదైన కార్లు, ఇళ్లు కొనే ప్రయత్నం చేయలేదని చెబుతుంటారు. నేను మాత్రం ఓ ఇల్లు కొనుకున్నా. స్వ‌యం కృషితో ఎద‌గ‌డం నేను చాలా ఇష్ట‌ప‌డ‌తాను. నా వెనుకు దేవుడు ఉన్నాడ‌ని బలంగా విశ్వ‌సిస్తాను అంటూ శృతి హాస‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

nivetha thomas special role in mahesh’s ‘sarkaru vaari paata’!

Lakshmi Manchu’s ‘Chitti Chilakamma’ YouTube channel hacked!