సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా విక్టరీ వెంకటేష్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రం ద్వారా సీతగా తెలుగు లోగిళ్ళల్లోని గడపగడపకూ అంజలి సుపరిచితురాలైంది. ఆ సినిమాలో తన అందచందాలతో, అమాయకమైన నటనతో అందిరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా మంచి విజయం సాధించినా, తెలుగులో సక్సెస్ఫుల్ హీరోయిన్ కాలేకపోయింది. అయితే ఆనాటి సీత బాధపడినట్లు.. మీరున్న రంగంలో ఎప్పుడైనా బాధపడ్డారా? అనే ప్రశ్న ఆమెకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది.
దీనికి ఆమె సమాధానమిస్తూ.. ”భగవంతుని దయ వల్ల సినిమాల ఫ్లాపులు నన్ను పెద్దగా బాధపెట్టలేదు
నా సినిమాలన్నీ మినిమమ్ గ్యారంటీతో ఆడినవే! సో…సినిమాల పరంగా ఎప్పుడూ బాధపడలేదు. కానీ గతంలో మా ఫ్యామిలీలో కొన్ని సమస్యలు వచ్చి అవి అందరి నోళ్ళల్లోనూ బాగా నానాయి. ఆ సమయంలో నన్ను ఓదార్చినవారి కన్నా, నా పరిస్థితిని చూసి హేళనగా మాట్లాడుతూ పనైపోయిందని అన్నవారే ఎక్కువ. నాతో సన్నిహితంగా ఉండేవారు కూడా నా వెనకాల అలాంటి మాటలు మాట్లాడడం నాకు చాలా బాధగా అనిపించింది..అప్పుడు నేను అనుభవించిన బాధ.. కుటుంబం కోసం పడ్డ తపన.. అవి తప్ప సినిమాల్లోకి వచ్చిన తరువాత నేను రంగంలో హ్యాపీగానే ఉన్నాను..” అని అంజలి తెలిపింది.