కాజల్ అగర్వాల్ నేటితో 36వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నటి నిషా అగర్వాల్ తన సోదరి కాజల్ కు ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్. అందరి ప్రేమాభిమానాలతో ఆయురారోగ్యాలతో ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.. అంటూ తన సందేశాన్ని అందరితో పంచుకుంది. నిషా అగర్వాల్ కాజల్ తో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకుంది. వ్యక్తిగత స్వార్థపూరిత కారణాల వల్ల కాజల్ ను త్వరలో తల్లిగా చూడాలనుకుంటున్నట్టు చెప్పింది నిషా. గౌతమ్ కిచ్లూతో పెండ్లి అయినప్పటికీ ఈ విషయాన్ని తాను కాజల్ కు చెప్తూనే ఉన్నానని చెప్పుకొచ్చింది. మరి కాజల్ అగర్వాల్ గుడ్ న్యూస్ ఏమైనా చెప్తుందా అనేది చూడాలి. కాజల్ కు చెల్లెలు అయిన నిషా అగర్వాల్ కు ఇప్పటికే పెళ్లవగా మూడేళ్ల కొడుకున్న సంగతి తెలిసిందే.