in

himaja about live miracles of sai baba idol at her house!

వినాయకుడి విగ్రహం పాలు తాగింది… సాయి బాబా విగ్రహం నుంచి విభూది వస్తుంది , కొన్ని విగ్రహాలు కళ్ళు తెరచాయి అన్న వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. వీటిని దేవుడి మీద నమ్మకం ఉన్నవారు.. దేవుళ్ళ మహిమ అంటూ కీర్తిస్తారు. దేవుడు లేరు అనే హేతువాదులు ఇదంతా భ్రమ.. అటువంటిది ఏమీ లేదు అని కొట్టివేస్తారు.. ఎవరు ఎన్ని చెప్పినా దేవుళ్లను నమ్మేవారు వారి మహిమలు అంటూ జరుగుతున్న వింతలను నమ్ముతూనే ఉంటారు.

ముఖ్యంగా షిర్డీ సాయిబాబా విగ్రహం లేదా పటం నుంచి విబూది రాలుతుంది అని సాయి భక్తులు తరచుగా చెబుతూనే ఉన్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి హిమ ఇంట్లో కూడా ఓ అద్భుతం చోటు చేసుకుంది.. ఈ విషయాన్నీ హిమజ స్వయంగా తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. తన ఇంట్లో ఉన్న ఒక సాయి బాబా విగ్రహం నుంచి విబూది రాలుతుందని బాబా..

విగ్రహం ముందు ఉన్న నీళ్లలో తులసి వాసన వస్తుందని స్వయంగా హిమజ చెప్పింది. ఆ విగ్రహం ఎప్పటి నుంచో తమ ఇంట్లో ఉందని.. ఇంటర్ చదువుతున్న సమయం నుంచి సాయిబాబా విగ్రహం తమ ఇంట్లో ఉందని.. 2004లో రమణానంద స్వామీజీ పరిచయం అయ్యారు. అప్పుడు ఆయన బాబాకి 19 రోజులు హోమం కూడా చేశాం. ఇక అప్పటి నుండి రోజు సాయిబాబా విగ్రహం తుడవడం, ముందున్న నీళ్ళని మార్చటం, పూజలు చేయటం నా డ్యూటీ అయిపోయింది.

Folk Singer Gaddar to act with Chiranjeevi?

ameesha patel at lulla’s fashion peview!