in

Folk Singer Gaddar to act with Chiranjeevi?

చిరంజీవి – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `ఆచార్య‌`. రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే, కాజ‌ల్ క‌థానాయిక‌లు. ఈ చిత్రంలో గ‌ద్ద‌ర్ ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆచార్య‌లో న‌క్స‌ల్ ఉద్య‌మంలో న‌డిచే ఓ కీల‌క‌మైన ఎపిసోడ్ ఉంది. ఈ ఎపిసోడ్ లో చిరు, చ‌ర‌ణ్ న‌క్స‌లైట్స్ గా క‌నిపిస్తారు. అదే ఎపిసోడ్ లో గ‌ద్ద‌ర్ పాత్ర కూడా రాబోతోంద‌ని టాక్‌.

ప్ర‌జా గాయ‌కుడిగా గ‌ద్ద‌ర్ కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. అభ్యుద‌య భావాలున్న చిత్రాల‌కు ఆయ‌న పాట‌లు అందిస్తారు. కొన్ని చిత్రాల్లో న‌టించారు కూడా. ఇప్పుడు `ఆచార్య‌`లోనూ ఆయ‌న క‌నిపించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే… గ‌ద్ద‌ర్ పై స‌న్నివేశాల్ని తెరకెక్కించ‌బోతున్నార‌ని, ఇదే సీన్‌లో చిరంజీవి కూడా క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌వుతుంది. అక్టోబ‌రులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌న్న‌ది చిరంజీవి ప్ర‌య‌త్నం. అక్టోబ‌ర్ దాటితే.. ఇక సంక్రాంతికే.

adah sharma at naturals salon launch!

himaja about live miracles of sai baba idol at her house!