in

heroines turning into item girls!

నుకున్నవి జరగనప్పుడు, జరుగుతున్న వాటితోనే అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అప్పుడే కెరీర్ కూడా ముందుకెళ్తుంది. అలాకాకుండా మేం కోరుకున్న అవకాశాలు వస్తేనే కెమెరా ముందుకెళ్తాం అంటే కష్టం. అందుకే చిన్న పాత్రలకు కూడా ఓకే చెబుతున్నారు ఇద్దరు యంగ్‌ బ్యూటీస్‌. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఐటెమ్ పాపలుగా మారుతున్నారు.హెభా పటేల్ ‘కుమారి 21 ఎఫ్’తో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయ్యింది. కానీ ఆ తర్వాత హెభాకి ఈ రేంజ్‌ హిట్స్ రాలేదు. ‘మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిస్సెస్‌’ లాంటి ఫ్లాపులొచ్చాయి. ఈ ఫ్లాపుల దెబ్బకి హెభా సపోర్టింగ్‌ రోల్స్‌కి పడిపోయింది. నితిన్ ‘భీష్మ’లో చిన్న రోల్‌ చేసిన హెభా, ఇప్పుడు రామ్ ‘రెడ్’లో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ‘డింఛక్’ అంటూ రామ్‌తో కలిసి స్టెప్పులేసింది కుమారి.

‘దర్శకుడు’ సినిమాతో మెప్పించిన పూజిత పొన్నాడకి ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. ‘రంగస్థలం’లో సపోర్టింగ్‌ రోల్‌ చేసినా కెరీర్‌లో పెద్దగా మార్పు రాలేదు. దీంతో పూజిత స్పెషల్‌ సాంగ్‌కి షిఫ్ట్ అవుతోందట. పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమాలో స్పెషల్‌ సాంగ్ చేస్తోందట పూజిత. ఒకప్పుడు వరస ఆఫర్స్ తో ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించినా రెజినా కాసాండ్రా పరిస్థి కూడా ఇదే, హీరోయిన్ గ ఛాన్సులు లేకపోవడంతో ఐటెం గర్ల్ గ మారిన ఈ బ్యూటీ చిరంజీవి ఆచార్య సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తుంది.

f cube ‘nidhi agarwal’

can you guess the first heroines of our heroes!