వరుస సినిమాలతో ప్రభాస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాదిలో ఆది పురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రభాస్.. త్వరలోనే సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో రానున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఓ నటి ప్రభాస్ మీద వివాదాస్పద రీతిలో స్పందించింది. బుట్ట బొమ్మ, కొరమీను, రాజరాజ చోళ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఇందు కుసుమ..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా..ప్రభాస్ పై బోల్డ్ కామెంట్స్ చేసింది. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరు ఎవరితో వర్క్ చేయడం ఇష్టపడతారు. మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా..ఆమె బోల్డ్ గా బదులిచ్చింది. “ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం, అతనికి చెల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తాను. ఆఫ్ స్క్రీన్ మాత్రం ‘ఐ విల్ రెప్ యు, ప్రభాస్ ను రేప్ చేస్తా ” అంటూ సంచలన వాక్యాలు చేసింది..!!