in

heroine found for balayya!

నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. `మోనార్క్‌` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. బాల‌య్య పుట్టిన రోజున‌… ఓ ప‌వ‌ర్ ఫుల్ టీజ‌ర్ విడుద‌ల చేశాడు బోయ‌పాటి. దానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. టీజ‌ర్ ని క‌ట్ చేసిన విధానం, అందులోని బాల‌య్య గెట‌ప్‌, ఇచ్చిన పంచ్ – ఇవ‌న్నీ బాల‌య్య అభిమానుల‌కు బాగా న‌చ్చాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాలోని హీరోయిన్ ఖ‌రారు కాలేదు. చాలామంది పేర్లు వినిపించినా – చిత్ర బృందం ఎవ‌రినీ ఫైన‌లైజ్ చేయ‌లేదు.

అయితే ఇప్పుడు మ‌రో కొత్త పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా అమ‌లాపాల్ ని ఫిక్స్ చేశార‌ని స‌మాచారం అందుతోంది. నిజానికి ఈ సినిమా కోసం ఓ కొత్త క‌థానాయిక‌ని ఎంచుకోవాల‌నుకున్నారు. దాని కోసం ఆడిష‌న్స్ కూడా చేశారు. కానీ… బాల‌య్య‌కు స‌రైన జోడీ దొర‌క‌లేదు. కొత్త‌మ్మాయిల‌తో రిస్క్ తీసుకోవ‌డం ఇష్టం లేక అమ‌లాపాల్ ని సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో.. సినిమాతో ఓ మెరుపులా మెరిసింది అమ‌లా. ఆ త‌ర‌వాత రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరో తో న‌టించినా పెద్ద‌గా గుర్తింపు ద‌క్క‌లేదు. ఈసారైనా.. తెలుగులో మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ దొరుకుతుందేమో చూడాలి.

Powerstar Official Trailer!

Prabhas Sister Praseedha Grand Entry!